వెంకయ్య నాయుడుని సన్మానించిన కోటపాటి

నవతెలంగాణ – ఆర్మూర్ 

భారత మాజీ ఉప రాష్ట్రపతి తెలుగు తల్లి ముద్దుబిడ్డ శ్రీ ముప్పావరకు వెంకయ్య నాయుడు గారికి ఇటీవల భారత ప్రభుత్వ ను రెండో అత్యున్నత పురస్కారము “  పద్మ విభూషన్ “  అవార్డు ప్రకటించిన సందర్భంగా తనకు రాజకీయ గురువు వెంకయ్య నాయుడు నీ మంగళవారం   ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక నాయకులు కోటపాటి నరసింహం నాయుడు చాలువా పూలమాలతో హైదరాబాదులో సన్మానించినారు..   శ్రీ వెంకయ్య నాయుడు కోటపాటి విద్యార్థి నాయకుడిగా ఆర్మూర్ డిగ్రీ కళాశాలలో చదువుకున్న  రోజుల్లో రప్పించి విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయించిన రోజులను  శ్రీ వెంకయ్య గుర్తు చేసుకున్నాడు.  అదేవిధంగా ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితో విద్యార్థి పరిషత్తులో పనిచేయడం ప్రస్తుతం గల్ఫ్ కార్మికులకు , రైతులకు చేస్తున్న సేవలకు గాను కోటపాటిని శ్రీ వెంకయ్య అభినందించారు .తన రాజకీయ గురువుకు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కోటపాటి ధన్యవాదాలు తెలిపారు . ఈ కార్యక్రమంలో చెంచు నాయుడు ,  జి శివకృష్ణ రావులు ,చంద్రబాబు నాయుడు  లు  పాల్గొన్నారు.