అర్బన్ పార్కును సందర్శించిన జెంటిల్ కిడ్స్ విద్యార్థులు

నవతెలంగాణ –  ఆర్మూర్ 

పట్టణం  జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్ విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్ లొ భాగంగా బాలబాలికలను అడివి మామిడిపల్లి దగ్గర చిన్నపుర్ లో గల అరణ్య అర్బన్ పార్క్ కి మంగళవారం సందర్శించడం జరిగింది. అక్కడ అటవీ అధికారి చే పిల్లలకు అడవిలో గల వివిధ రకాల చెట్ల జాతుల గురించి వాటి ప్రాముఖ్యత , ఉపయోగాల గురించి వివరించడం జరిగింది. ఇందులో భాగంగా అటవీ యొక్క పరిసరాలను సందర్శించడంలో విద్యార్థిని విద్యార్థులు హర్షోల్లాసంతో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని , ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.