7వ బెటాలియన్ లో జాతీయ అమరవీరుల దినోత్సవం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ లో  కమాండెంట్ బి. రాంప్రకాష్ ఆధ్వర్యంలో బెటాలియన్ పరెడ్ గ్రౌండ్ లో జాతీయ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కమాండెంట్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు తను ప్రాణాలను తృణ ప్రాయంగా వెట్టి బ్రిటిష్ వారితో పోరాడి వారి కబంద హస్తాలనుండి విముక్తి చేసి మన దేశానికి స్వాతంత్య్రం సంపాదించి పెట్టింరన్నారు. ఈ స్వాతంత్ర సంగ్రమంలో వారి ప్రాణాలను త్యాగం చేసినవారు వారి త్యాగ నిరతి చిరస్మరణీయమని కొనియాడారు. అందుకే ప్రతి ఏటా జనవరి 30న జాతీయ అమరవీరుల స్మారక దినోత్సవం జరుపుకుంటాని తెలిపారు. బెటాలియన్ అధికారులు, సిబ్బంది 2 నిమిషాల పాటు మౌనం పాటించి జాతీయ అమరవీరులకు నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కమాండెంట్ సి. అంజనేయ రెడ్డి, ఎఓసి. హంసారాణి, యఉఎంఓ డాక్టర్ అనువమా ఆర్.ఐ లు. సీ. వెంకటేశ్వర్లు, యల్. మహేష్, యం. నరేష్, కె. శ్యామ్రావు, బి. వసంత్ రావు, ఆర్.యస్.ఐ లు, సిబ్బంది, మినియల్ స్టాఫ్ పాల్గొన్నారు.