నవతెలంగాణ – మిరు దొడ్డి
ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్స సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కే . శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు గత సంవత్సరం ఫలితాల మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని, క్రమశిక్షణతో ఉండాలని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మాట్లాడారు. అతిథిగా విచ్చేసిన జూనియర్ లెక్చరల సంఘ అధ్యక్షుడు కనకచంద్ర మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు, క్రమశిక్షణ ఉండాలని మరియు పూర్వ విద్యార్థుల ప్రతిభను గుర్తు చేశారు. ఈ వేడుకలో బదిలీపై వెళ్లిన అధ్యాపకులు సాయినాథ్, శ్రీవాణి లను ఘనంగా సన్మానించరు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఫిబ్రవరి 1 నుండి జరిగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి ద్వితీయ సంవత్సర విద్యార్థులు మరియు ఫిబ్రవరి 16 నాడు జరిగే ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కి, 19 నాడు జరిగే ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ కి ప్రథమ సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని ప్రిన్సిపాల్ గారు సూచించారు. ఈ వార్షికోత్సవ వేడుకలు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.