గ్రామ అభివృద్ది కమిటీ చట్ట బద్దమైన వ్యవస్థ కాదు

– గ్రామ అభివృద్ది కమిటీ సభ్యుల బైండోవర్ : సీఐకే మల్లేష్..

నవతెలంగాణ – డిచ్ పల్లి
ధర్పల్లి మండలం మైలారం, డిచ్ పల్లి మండలంలోని కొరట్ పల్లి గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు కొరట్ పల్లి వాగు విషయంలో గొడవపడే  అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగానే దర్పల్లి మండలంలోని మైలారం గ్రామానికి చెందిన 12 మంది విడిసి సభ్యులు
కొలి శశి రెడ్డి,రమ్మయ్యగారి గంగా రెడ్డి,దాసరి బాల సాయి,నూతపల్లి అజయ్,పడాల గంగాధర్,బాణపల్లి సాయి చరణ్,నూతపల్లి శంకర్,
చాకలి చిన్న రాజన్న,గడ్డం సంతోష్, దయ్యాల మురళి,రెంజర్ల లింగ రెడ్డి, కర్రోల్ల రమేష్, ఉన్నారు. డిచ్ పల్లి మండలం లోని కొరట్ పల్లి గ్రామానికి చెందిన 13 మంది విడిసి సభ్యులు అబ్దుల్ నూర్ ఖాన్,చెమ్మతి సుశాంత్, పుల్ల ముత్తన్న,సాంపల్లి నవీన్,మాటే మహేందర్,మరకంటి రాజేష్,బొల్లారం శేకర్,నాగపురం రాజా గౌడ్,తుమ్మ రాజేందర్,ఎర్రం పెద్ద గంగారం, చెప్పాలా రమేష్, బందుగుల ప్రభాకర్, లోక్కిడి ఆషన్న లను డిచ్ పల్లి తహసిల్దార్ రాజేందర్ ముందు రెండు లక్షల రూపాయలకు బైండోవర్ చేసిన అనంతరం డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మల్లేష్  విడిసి సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మల్లేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ది కమిటీ కి చట్ట బద్దమైన వ్యవస్థ కాదని, గ్రామాలలో విడిసి లో సభ్యులుగా ఉన్న లేక విడిసి పేరుతో గ్రామాలలోని సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తూ, భయ బ్రాంతులకు గురి చేస్తూ వారి వద్ద నుండి అక్రమ వసూళ్లు చేసినట్లయితే వెంటనే బాధితులు, ప్రజలు నిర్భయంగా వారిపై పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని సిఐ కె మల్లేష్ తెలిపారు.