‘పౌర హక్కులపై అవగాహన ఉండాలి’

నవతెలంగాణ-చౌడాపూర్‌
రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒకరికీ అవగా హన ఉండాలని చౌడాపూర్‌ తహసీల్దార్‌ ప్రభులు, ఎస్సై శ్రీశైలం, సర్పం చ్‌ కొత్త రంగారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించి యువత, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. పలువురు మాట్లాడు తూ… పౌరులందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందన్నారు. అనంత రం బాల్యవివాహాలు, బాలకార్మికులు, సమాజంలో కుల వివక్షత అంటరా నితనం పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో పంచా యతీ కార్య దర్శి రాజిరెడ్డి, రెవిన్యూ సిబ్బంది లింగప్ప, మరికల్‌ వార్డెన్‌ వెంకటయ్య, అంగన్‌వాడీ టీచర్లు యాదిబాయి, కల్పన, ఆశా వర్కర్లు యాదమ్మ, జంగమ్మ, యాదమ్మ, వెంకటేష్‌, మణికంఠ, రాము, ముబీన్‌, శీను, నరేష్‌, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.