కోస్లి పంచాయతీ పాలకవర్గానికి సన్మానం

నవతెలంగాణ – నవీపేట్
మండలంలోని కోస్లి గ్రామపంచాయతీ పాలకవర్గానికి వైస్ ఎంపీపీ హరీష్, కార్యదర్శి అఖిల్ లు బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నీలేష్ కుమార్  మాట్లాడుతూ..గ్రామ ప్రజలు తమకు గత ఐదు సంవత్సరాలుగా సేవలందించే అవకాశం ఇచ్చినందుకు అభివృద్ధి, సంక్షేమంలో  సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.