గొల్లపల్లి గ్రామంలో విషజ్వరాలు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలం లోని గోల్లపల్లి గ్రామంలో 30 మందికి  విష జ్వరాలు వచ్చాయని గ్రామస్తులు బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బర్దిపూర్ శివారులోని ఒక పత్రిక కార్యాలయం వద్ద చెరుకుంటలో ధర్మారం, బర్దిపూర్ గ్రామాలకు చెందిన చేత్త, కళ్యాణ మండపం చెత్త ను కుంట చెరువులో వేయడం వల్లనే గోల్లపల్లి గ్రామంలో 30 మందికి పైగానే విషజ్వరాలు  వచ్చాయని వారన్నారు. చేత్త వేయకుండా చర్యలు తీసుకోని  విషజ్వరాలు మరింత ప్రాభలకుండా చుడాలని గ్రామస్తులు కోరుతున్నారు. విషజ్వారలు సోకిన వారిలో  కొనకొల్ల  సురేష్, సాకలి అనసూయ, గుడాల మనోహర్, పెద్దోళ్ల లింగం, సంఘీ రమేష్ కొడుకు, తేలు సాయమ్మ ,గుడాల మల్లవ్వ, గుడాల ప్రసాద్, మనోహర్, దొరల శ్యామ్ రావు, దొర గొల్ల రాజవ్వ తో పాటు తదితరులు ఉన్నారు.