నవతెలంగాణ-రామగిరి
రామగిరి మండలంలోని నాగేపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ కొండవేన ఓదెలు యాదవ్ ఆధ్వర్యంలో అర్చ కులు సముద్రాల శ్రీనివాసచార్యులుతో వేదమంత్రాలతో, చదువుల తల్లి జ్ఞాన సరస్వతి విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ ఇనుముల రమేష్ ,ఎంపీఓ కాటం భాస్కర్ లు హాజరై మాట్లాడారు.. గ్రామ సర్పంచ్ ఓదెలు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన జ్ఞాన సరస్వతి విగ్రహం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని వారన్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా పాఠశాలలో ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుని, ఆధ్యాత్మిక తో పాటు విద్యాపారంగతులు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్,గ్రామ ఉప సర్పంచ్ చిట్టంపల్లి అనిల్ కుమార్, వార్డు సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్ వేగోళపు శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి గొర్రె సంతోష్ ,వెంకటేష్ ,శ్యామ్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, అంగన్వాడి టీచర్స్ మాజీ సర్పంచ్ ఎరుకల బాబురావు( ఓదెలు) గ్రామ నాయకులు ముప్పిడి శంకరయ్య, మాచిడి లచ్చన్న, పొన్నం కొమురయ్య, పొన్నం బాలకృష్ణ, మాచిడి వెంకన్న, గ్రామంలోని యువకులు కొండవేన ప్రభాకర్ యాదవ్, కొండవేన సుధాకర్ యాదవ్, నాడెం శ్రీనివాస్, వేగోళపు సంతోష్, మట్ట ప్రశాంత్, వేగోళపు సందీప్, నాడెం రాజేష్, బండి రాకేష్, కొండవేన అశోక్, దొమ్మటి కిరణ్, వేగోళపు అశోక్, పోలు రమేష్, వేగోళపు రంజిత్, వేగోళపు అనిల్ చాటపూరి రాజ్ కుమార్, పల్లెర్ల శ్రావణ్, వేగోలపు కాంతు, పిట్టల అనిల్, ఎరుకల కిరణ్, గుర్రాల దిలీప్, ఎరుకల ప్రదీప్ ,నేరెళ్ల ప్రదీప్, జాగిరి రమేష్, సాయిరాం, తీగల అజయ్, నరేష్ పంచాయతీ సిబ్బంది, గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.