నవతెలంగాణ – యైటింక్లైన్ కాలనీ: 2024 సంవత్సరానికి గాను కార్మిక రత్న నేషనల్ అవార్డుకు 8వ కాలనీకి చెందిన హెచ్ఎంఎస్ సెంట్రల్ కమిటీ కేంద్ర కార్యదర్శి గోశిక అశోక్ ఎంపికైనట్టు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడంకోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు,సంఘ సేవకులకు, రచయితలకు ,కవులకు, స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డు అందజేయనున్నట్లు వారు తెలియజేశారు.ఈ అవార్డు రావడానికి సహకరించిన జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులకు గోశిక అశోక్ కృతజ్ఞతలు తెలిపారు.