‘బుతు ప్రేమ’పై అవగాహన..

నవతెలంగాణ-దుబ్బాక : దుబ్బాక పట్టణంలోని వైశ్య భవన్లో డాక్టర్ శాంత కుమారి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి వనిత భూమి రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బుతు ప్రేమ కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడారు మహిళల ఆరోగ్యాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి మంగళవారం మహిళ ఆరోగ్యసేవలతో పాటు “బుతు ప్రేమ” సేవలు అందనున్నట్లు తెలిపారు.మహిళలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.అనంతరం మహిళలకు మెట్రోల్ కప్స్ ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి,కౌన్సిలర్లు దేవుని లలిత చంద్రయ్య, లొంక రాజవ్వ లచ్చయ్య,ఆర్ పి లు ఆశాలు మహిళలు పాల్గొన్నారు.