యూనివర్సిటీ వీసీ రవీందర్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి..

– ఈసీ నిర్ణయించిన తీర్మానాలను వెంటనే అమలు చేయాలి
– మంత్రి ప్రశాంత్ రెడ్డి యూనివర్సిటీ పై స్పందించి అభివృద్ధి చేయాలి.
– భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జివియం.విఠల్ డిమాండ్
నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రవీందర్ ను బర్తరఫ్ చేసి చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి జివియం. విఠల్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ కి వైస్ ఛాన్సలర్ రవీందర్ పదవి చేపట్టిన నాటి నుండి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ తన ఏకపక్ష నిర్ణయాలతో యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారన్నారు. ఈసీ ఆమోదించకుండా ఇష్టానుసారంగా కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారని, ఈసీ నిర్ణయం లేకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా తన స్వా లాభాల కోసం రిజిస్ట్రార్ లను నియమిస్తూన్నారని మండిపడ్డారు. గత నెల నుండి ఇప్పటివరకు నలుగురు రిజిస్టర్లను మార్చారే తప్ప అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు .ఈసీ సమావేశాలలో నిర్ణయించిన తీర్మానాలను అమలు చేయకుండా ఈసీ సభ్యులు మౌనంగా ఉండడం సరికాదన్నారు. పేరుకే ఏసీబీ కేసులు అనుకుంటూ యూనివర్సిటీ పేరును దిగజారుస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ గురించి ఇంతలా చర్చ జరుగుతుంటే ప్రభుత్వం వైస్ ఛాన్స్లర్ రవీంద్ర పై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి సవాల్ చేస్తున్న అతను పదవిలో కొనసాగుతుందంటే ప్రభుత్వమే అయనకు మద్దతు చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఆమడ దూరంలో ఉన్న యూనివర్సిటీ సమస్యలు కనిపిస్త లేవా అని ప్రశ్నించారు. యూనివర్సిటీ సెలవులు అయిపోవడానికి సమయ దెగ్గరకు వస్తున్న హాస్టల్ లో ఇప్పటివరకు సమస్యలను పరిష్కరించకుండా వాటిని అభివృద్ధి చేయకుండా రిజిస్ట్రార్ మార్పుతోనే గడుపుతున్న లోని పేర్కొన్నారు. వెంటనే వైస్ ఛాన్సలర్ రవీందర్ ను భర్త రఫ్ చేసి  యూనివర్సిటీ ప్రతిష్టను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థి సంఘాలు, విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ నాయకులు సూరజ్,రమణ, రవి, విజయ్ ,చక్రి, నరేష్, యాదవ్, శంకర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.