నవతెలంగాణ-భిక్కనూర్ : నకిలీ మందులు, విత్తనాలు విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేయడం జరుగుతుందని టాస్క్ ఫోర్స్ తనిఖీ అధికారి రత్న తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గడువు ముగిసిన విత్తనాలు, పెస్టిసైడ్స్ పరిశీలించారు. పెస్టిసైడ్స్ యొక్క వివరాలు రికార్డులను నమోదు చేయాలని, నకిలీ విత్తనాలు, మందులను విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. కొన్ని దుకాణాలలో రికార్డులు సరిగ్గా లేని కారణంగా విక్రయ దారులను హేకర్ హెచ్చరించారు. ఈ తనిఖీలలో లింగంపేట్ ఏవో అనిల్ కుమార్, భిక్నూర్ ఏవో రాధా, ఏ ఈ ఓ లు, తదితరులు ఉన్నారు.