పంచాయతీ పాలకవర్గ సభ్యులకు వీడ్కోలు 

నవతెలంగాణ –  కమ్మర్ పల్లి
మండలంలోని  హస కొత్తుర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డ్ సభ్యుల ఐదు సంవత్సరాల పదవీకాలం ముగియడంతో గురువారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.  పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, గ్రామ అభివృద్ధి కమిటీ కార్యవర్గ సభ్యులు గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులందరినీ శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్  మాట్లాడుతూ బాధ్యతలు చేపట్టిన ఐదు సంవత్సరాల నుండి  గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి, మండల స్థాయి, జాతీయ అవార్డులు రావడానికి సహకరించిన సిబ్బందికి ,పాలకవర్గం సభ్యులకు ,గ్రామస్థులకు, గ్రామ, మండల స్థాయి అధికారులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పని చెప్పే విషయంలో గాని సరియైన సమయంలో ఎవరినయినా మందలించి వుంటే క్షమించాలి మనస్ఫూర్తిగా క్షమించాలని పంచాయతీ సిబ్బందిని కోరారు. గ్రామంలో పారిశుధ్యం విషయంలో, పరిపాలన సౌలభ్యం అందించడంలో జవాబుదారీగా వుండాలనే సిబ్బందిపై కోప్పడమే గాని ఎవరిపై తనకు కోపం ద్వేషం లేదన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, పంచాయతి సెక్రటరీ నర్సయ్య, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రజినీకాంత్, కార్యవర్గం సభ్యులు, వార్డ్ సభ్యులు ఆనంద్, శ్రవణ్, శ్రీహరి, పుష్ప, మాధురి, లావణ్య, సరిత, లక్ష్మీ, శాంత, సుమలత, కరోబర్  రమణ, భారత్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.