
నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : ఫైలేరియా నివారణకు ప్రభుత్వం చర్యలుచేపడుతుందని చికోడ్ గ్రామ సర్పంచ్ తౌడ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల ఆదేశాల చికోడ్ గ్రామంలో ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు కిట్లు పంపిణీ చేశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి మందులు అందిస్తూ… వ్యాధి తీవ్రతరం కాకుండా నియంత్రించడానికి ప్రభుత్వం పని చేస్తోందన్నారు.ఇక ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు పింఛన్ ఇవ్వడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం పద్మ, ఆశవర్కర్లు,గ్రామస్తులు పాల్గొన్నారు