దళిత అడ్వకేటుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

నవతెలంగాణ కంటేశ్వర్ : దళిత అడ్వకేట్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కులావివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నిజాంబాద్ నాందేవ్వాడలోని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కులావివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండగంగాధర్  మాట్లాడుతూ.. తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గాదరి కిషోర్  ఎమ్మార్పీఎస్ కొడుకులు అంటూ పరిష పదజాలాన్ని ఉపయోగించినందుకు తీవ్రంగా ఖండిస్తున్నాం దళిత బంధు అవినీతిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే అనుచరులతోటి ఒంటరిగా చూసి దాడి చేయడం జరిగింది ఈ దాడిని కెవిపిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఎమ్మెల్యే అనుచరులు భౌతిక దాడి చేయడం సమంజసంకాదు. ముఖ్యమంత్రి స్వయంగా అవినీతి పాల్పడ్డ వారి చిట్టా నా దగ్గర ఉందని జ్ఞాపకం చేశారు అదే విషయాన్ని న్యాయవాది యుగంధర్ అన్నారు అయినప్పటికీ కూడా దళిత ఎమ్మెల్యే ఉండి కూడా ఈ విధంగా పరుష మాటలుప్రయోగించడం సరియైన విధానం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో భూమన్న తదితరులు పాల్గొన్నారు.