
తెలంగాణ యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాల్ , యూనివర్సిటీ అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ లతో సమావేశమయ్యారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి డైరెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగా ఏర్పాటయినా ఎంబీఏ/ ఎంసీఏ/ బి బి ఏ/ బి సి ఎ/ కళాశాలలకు 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచి( ఏఐసిటిఇ ) అనుమతులు తప్పనిసరి అని సూచించారు.
ఈ మెరకు అన్ని కళాశాలలు తప్పనిసరిగా అనుమతులకు చర్యలు తీసుకోవాలని సూచించారు.పాత ,కొత్త కళాశాలలకు ( ఏ ఐ సి టి ఇ ) గడువు ఫిబ్రవరి 7 వరకు పోడగించిన నేపథ్యంలో అన్ని కళాశాలలు నిర్ణీత గడువులో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు( ఏఐసీటిఇ ) అనుమతులు లోని కళాశాలలకు వచ్చే ఏడాది నుంచి అనుబంద గుర్తింపు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పారు.ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయడంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను యూనివర్సిటీ తొలగించి సహకరించాలని కోరగా రిజిస్ట్రార్ తో చర్చించి విషయం నిపుణులతో వర్క్ షాప్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఆడిట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.