సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి: సీఐటీయూ

నవతెలంగాణ – అశ్వారావుపేట
భాజపా ఆద్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలను ప్రతిఘటిస్తూ,నాలుగు లేబర్ కోడుల ను రద్దు చేయాలని, వేతనాలు పెంచాలని కార్మికులను పర్మినెంటు చేయాలని,కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్లతో జరుగుతున్న ఫిబ్రవరి 16న గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె లో పాల్గొనాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ కోరారు. గ్రామపంచాయతీ కార్మికుల సమావేశం నరసింహారావు అధ్యక్షతన గురువారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద లో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు అమలు చేయాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వంలో పరిష్కారం కానీ ఈఎస్ఐ పిఎఫ్ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఆరు గ్యారెంటీల పథకంలో గ్రామపంచాయతీ కార్మికులకు తొలి ప్రాదాన్యత ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భూషణం వరలక్ష్మి రాణి దుర్గమ్మ లక్ష్మీ స్వప్న ఇందిరా తదితరులు పాల్గొన్నారు.