జీపీలలో భాధ్యతాయుతంగా పని చేయండి

– పెద్ద ఎడ్గి జీపీ ప్రత్యేక అధికారీ .

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఎడ్గి గ్రామములోని పంచాయతి సర్పంచుల పదవి కాలం ముగియడంతో  ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. శుక్రవారం మండలంలోని ముప్పై జీపీ లలో ప్రత్యేక అధికారులు బాద్యతలు తీసుకోవడం జర్గింది. అందులో భాగంగా పెద్ద జీపీలో సర్పంచ్ వినోద్, ఉప సర్పంచ్ ఖండేరావ్, జీపీపాలకవర్గం లకు గ్రామ పంచాయతి కార్యదర్శి కాంబ్లే  నాగయ్య అద్యక్షత వహించి ప్రతి ఒక్కరికి ఘణంగా సన్మానం చేసారు. ప్రత్యేక అధికారిగా బాద్యతలు చేపట్టిన తహసీల్దార్ గంగా సాగర్ ను శాలువా పుష్ప గుచ్చం జేపిఎస్ నాగయ్య  ఇచ్చి సన్మానించి ఆహవ్వనించారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్ లు  ప్రత్యేకఅధికారికి,  జేపిఎస్ కు కృతఙ్ఞకలు తెలిపారు. గ్రామాభివృద్దికి మాజీ సర్పంచులు పాలకవర్గం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ , ఉప సర్పంచ్,  గ్రామస్తులు తదితరులు పాల్గోన్నారు.