
తెలంగాణ మెడికల్ హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్న ఎం.ఎ.కే జిలానీ ఎంపిక అయ్యారు. శుక్రవారం హైదరాబాద్ సచివాలయం లోని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్,వర్కింగ్ ప్రెసిడెంట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శాంతి కుమార్ గౌడ్ జిలానీ కి శుక్రవారం అందజేశారు.ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్న జిలానీ యూనియన్ విస్తరణ,సభ్యుల సంక్షేమం కోసం అహర్నిశలు కష్ట పడుతున్నారని,ఎవరికి ఏ ఆపద వచ్చి నా వెంటనే స్పందించే వ్యక్తి గా జిలానీ ని ఎంపిక చేయడం జరిగిందని యూనియన్ అధ్యక్షులు తెలిపారు.జిలానీ హాస్పిటల్ కు వచ్చే రోగులకు ఎలాంటి అంతరాయం లేకుండా విధులు ఏవి వచ్చినా తన కర్తవ్యంగా నిర్వర్తించి అంచెలంచలు గా అటు యూనియన్ నాయకులతో ఇటు అధికారులతో ముందుకు సాగడంతో తో యూనియన్ లోని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యత చేపట్టడంతో తోటి సిబ్బంది అశ్వారావుపేట ప్రాంత ప్రజలు జిలానీ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బిక్షపతి, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.