
మండలంలోని ఖానాపూర్ గ్రామంలో శుక్రవారం వీడీసీ సభ్యులు తమ ప్రతాపాన్ని చూపించినట్టు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని చర్చికి గల 2 వందల గజాల స్థలానికి కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకోగా ,వీడీసీ సభ్యులతో పాటు, వార్డు సభ్యులు ,యూత్ సభ్యులు కలిసి ప్రహరీని ధ్వంసం చేసినారు .ఇట్టి విషయమై స్థానిక పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని ,గ్రామాలలో వీడీసీల పెత్తనం పై చర్యలు తీసుకోవాలని తెలిపారు.