
మాజీ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర బీజేపీ నాయకులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గిగా ఫౌండేషన్ లక్ష్మీ నరసింహ స్వామి ఐదు లక్షల ప్రమాద బీమా కు ప్రజల నుండి అపూర్వస్పందన వస్తుందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు పందులసత్యం గౌడ్ తెలిపారు. శుక్రవారం చండూరు మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో అర్హులైన వారి నుండి150 రూపాయలు చెల్లించి5 లక్షల బీమా బాండును వారికి అందజేశారు. ఈ సందర్భంగా పందుల సత్యం మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరు నరసన్న భీమా ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లెట్ల పెద్ద పాండు, దోటి నవీన్, దొంతరగోని ఆంజనేయులు, కట్ట వెంకన్న తదితరులు పాల్గొన్నారు.