వాటర్ ఫిల్టర్ బెడ్ ను పరిశీలించిన నగర మేయర్

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ నగరానికి త్రాగు నీరు సరఫరా చేసే అలీసాగర్ ఫిల్టర్ బెడ్ లో నీటి శుద్ధిని నిజామాబాద్ నగరం మేయర్ దండు నీతు కిరణ్ శుక్రవారంపరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులతో మాట్లాడుతూ.. స్వచ్ఛమైన త్రాగు నీరు సరఫరా జరగాలని ఎక్కడ నీటి కలుషితానికి ఆస్కారం లేకుండా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగు నీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ.. నగరానికి అధిక మొత్తములో నీటిని సరఫరా చేసే అలీసాగర్ ఫిల్టర్ బెడ్ లో జరిగే నీటి శుద్ధి ప్రక్రియను పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ ఆనంద్ సాగర్, అసిస్టెంట్ ఇంజనీర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.