మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే సామెల్

నవతెలంగాణ-నూతనకల్ : మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇమ్మారెడ్డి చోక్కమ్మ , ఇరుగు హుస్సేన్ లతోపాటు మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన బాణాల చంద్రమ్మ ,బిక్కి పద్మ, ఉప్పునూతల వెంకన్న లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం తుంగతుర్తి శాసనసభ సభ్యులుమందుల సామెల్ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు అనంతరం మృతుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి పిఎసిఎస్ చైర్పర్సన్ నాగం జయసుధ , ఎంపీటీసీ పన్నాల రమ  నాయకులు కట్ట మల్లారెడ్డి,  తీగల గిరిధర్ రెడ్డి, కళ్లెం కృష్ణారెడ్డి పసుల అశోక్ యాదవ్ చురకంటి చంద్రారెడ్డి, పన్నాల మల్లారెడ్డి, బాణాల సుదర్శన్ రెడ్డి బత్తుల నాగమల్లు, బాణాల మల్లారెడ్డి కూసు వెంకన్న పెద్దింటి మోహన్ రెడ్డి ఉప్పునూతల  గోవింద్,బొడ్డుపల్లి అంజయ్య పచ్చిపాల వెంకన్న పాల్వాయి నాగరాజు బత్తుల వెంకట్ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.