ప్రజల సౌలభ్యం కోసం ఫంక్షన్ హాల్ లు ఉపయోగపడాలి

– జీ.పీ.ఆర్. పంక్షన్ హల్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్  బీర్ల అయిలయ్య
నవతెలంగాణ – భువనగిరి
ప్రజల యొక్క, అవసరాలకు శుభకార్యాలకు పంక్షన్ హల్ లు అందుబాటులో ఉండి ఉపయోగపడాలని ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల అయిలయ్య అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం రాయగిరి శివారులోని జీ పీ ఆర్ గార్డెన్ (పంక్షన్ హాల్)ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.  పంక్షన్ హల్ లు సామాన్యులకు అందుబాటు ధరలో ఉండి, ఉత్తమ సేవలందించాలని ఆయన కోరారు. ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ చిన్నా , పెద్ద శుభకార్యాలు పంక్షన్ హల్ లోనే  జరుపుతున్నారని ఆయన అన్నారు.  సామాజిక సేవా దృక్పథంతో, యాజమాన్యం వినియోగదారులకు నాణ్యమైన సేవలందించి మంచిపేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. పంక్షన్ హాల్ ప్రారంభ కార్యక్రమంలో భువనగిరి ఎంపిపి నరాల నిర్మల వెంకటస్వామి, ఆత్మకూరు ఎంపిపి తండ మంగమ్మ శ్రీశైలం, యాదగిరిగుట్ట కౌన్సిలర్ ముఖ్యర్ల మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు యాస లక్ష్మారెడ్డి , చిక్కుల వెంకటేష్,  ఎడ్ల శ్రీను,  కోట పెద్ద స్వామి, నుచ్చు  నాగయ్య ఆత్మకూరు మాజీ సర్పంచ్ నగేష్, మాజీ ఉపసర్పంచ్ నవ్య జీ పీ ఆర్ పంక్షన్ హాల్ యాజమాన్యం  సి.ఎచ్.తిరుమల్ రెడ్డి, సంగారెడ్డి, బోయిని శ్రీనివాస్, ఎన్ .ఎస్ .రెడ్డి, సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్, నరేందర్, గడ్డమీది మల్లేష్, బోయిని మల్లేష్ పాల్గొన్నారు.