సినిమా పబ్లిసిటీ డిజైనర్‌గా అందరికీ సుపరిచితమైన వివ రెడ్డి (విష్ణువర్ధన్ రెడ్డి మావూరపు) హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఓ తండ్రి తీర్పు’. ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ ఆరిగపూడి విజరు కుమార్ సమర్పణలో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మిస్తున్నారు. ప్రతాప్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌తో పాటు ఎడిటింగ్ కూడా పూర్తి చేసుకుంది.
రాజేంద్ర రాజు కాంచన పల్లి రచన, దర్శకత్వ పర్యవేక్షణలో
తల్లిదండ్రుల ఆస్తులపై ఉన్న ప్రేమ పిల్లలకు తల్లిదండ్రులపై లేకపోవటం ఎంత మానసికక్షోభకు గురిచేస్తుందో తెలియజేసే సినిమా ఇది. ఈ చిత్రంలో కొడుకుగా వివ రెడ్డి చేస్తున్న ప్రధానమైన పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగించేదిగా ఉంటుందని, ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని, ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నిర్మాత శ్రీరామ్ దత్తి అన్నారు.