గంజాయి దందాలో ఇద్దరు ఏపీ పోలీసులు

– 22 కిలోల గంజాయి పట్టివేత
నవతెలంగాణ-దుండిగల్‌
ఏపీలో విధులు నిర్వహించే పోలీసులు సెలవుల మీద హైదరాబాద్‌కు వచ్చి గంజాయి రవాణా చేస్తూ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పోలీసులకు చిక్కారు. వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌ మూడో బెటాలియన్‌కు చెందిన పోలీస్‌, మరొక కానిస్టేబుల్‌ రెండ్రోజులు విధులకు సెలవు పెట్టారు. హైదరాబాద్‌కు కారులో 22 కిలోల గంజాయి తీసుకొచ్చారు. బాచుపల్లిలో గంజాయిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పక్కా సమాచారం తెలుసుకున్న బాలానగర్‌, బాచుపల్లి ఎస్‌ఓటీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో పోలీసులే అక్రమ సంపాదనే మార్గంగా ఎంచుకొని గంజాయిని అమ్ముతున్నట్టు నిర్ధారించారు. గంజాయి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేశారు.