అభివృద్ధి ధ్యేయంగా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అందరి సహకారంతో గ్రామ అభివృద్ధి చేసిన ఘనత గ్రామ ప్రజలతోపాటు పంచాయతీ పాలకవర్గం, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు దక్కుతుందని శనివారం గోకుల్ తాండ మాజీ సర్పంచ్ లలిత లింబాద్రి నాయక్ అన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో 5 సంవత్సరాల పదవి కలాని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు వారికి శాలువాతో సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శోభ, మాజీ ఉపసర్పంచ్ తిరుపతి నాయక్, గ్రామపంచాయతీ మాజీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.