మేడారంలో జనసంద్రం..

– ముందస్తుగా భారీ మొక్కులు
– వనదేవతలను దర్శించుకున్న ప్రముఖులు
– పూజారుల సంఘం, పోలీస్ శాఖ ల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు
నవతెలంగాణ -తాడ్వాయి
ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతర మేడారం మహా జాతర. శనివారం నాడు కూడా భక్తజనం జన సంద్రం లాగా మారింది. సందర్శకులు మొదట జంపన్న వాగు వద్దకు చేరుకొని పుణ్య స్థానాలు ఆచరించి గద్దెల వద్దకు చేరుకొని సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీర సమర్పించి ప్రత్యేక మొక్కలు చెల్లించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఎండోమెంట్ డీఈవో రాజేంద్రం ఆధ్వర్యంలో సందర్శకులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. సాంప్రదాయాల ప్రకారం దర్శనానికి వచ్చిన సందర్శకులకు ప్రముఖులకు డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికి, అన్ని ఏర్పాట్లు చేశారు.
వనదేవతలను దర్శించిన ప్రముఖులు
శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్పక్క దంపతులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సూరపనేని నాగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ గూడూరు మైపాల్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎనగంటి నరేష్ లతో కలిసి సకుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకున్నారు. మల్టీ జోన్2 ఐజి డాక్టర్ తరుణ్ జోషి, తో ములుగు జిల్లా ఎస్పీ శబరిస్, అదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం మరియు మిగతా జిల్లాల ఎస్పీలు దర్శించుకున్నారు. వీరికి పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధమైన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క పూజారి సిద్ధబోయిన రానా రమేష్ డోలు వాయిద్యాలతో ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు ఇష్టమైన పసుపు కుంకుమ చీర సమర్పించి ప్రత్యేకముక్కులు చెల్లించారు. అనంతరం శాల్వాన్ కప్పి ఘనంగా సన్మానించి వనదేవతల ప్రసాదం అందించారు.
ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు
మేడారం మహా జాతర కు ముందు నుండే సందర్శకులు తాకిడి ఎక్కువగా ఉన్నందున ముందస్తుగానే జిల్లా ఎస్పీ శబరీష్ పోలీస్ శాఖ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలకు ట్రాఫిక్ జామ్ కాకుండా మేడారం జాతర ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జన సందోహం అధికంగా ఉండే ప్రాంతాల్లో పోలీస్ బలగాలు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.