ట్రాఫిక్ నియమాలు పాటించిన వాహనదారులకు సన్మానం..

నవతెలంగాణ – ఏర్గట్ల
రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమాలు పాటించి,హెల్మెట్ ధరించిన వాహనదారులను భీంగల్ సిఐ శ్రీనివాస్,ఎస్సై మచ్చెంధర్ రెడ్డి శాలువాతో సన్మానించి, వారి చేతికి పూలు, చాక్లెట్లను అందించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వాహనదారులు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్ళ పాల్గొన్నారు.