– ఉపాధ్యాయుడు ప్రవీన్ చోరవతో బాల కార్మికుడికి విముక్తి
– విద్యార్థి బడి మానేసి హోటల్ యందు కూలీ పని
నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలో బాలుర ప్రభుత్వోన్నత పాఠశాల యందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థి గత కొద్ది నెలలుగా బడి మానేసి హోటల్ యందు కూలీ పనిచేస్తున్నాడు. అంగ్ల ఉపాధ్యాయుడు ప్రవీన్ ప్రత్యేక చోరవ చూపడంతో శనివారం బాల కార్మికుడు మళ్లీ బడిబాట పట్టాడు.విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయుడు ప్రవీన్ సూచించారు. ఉపాధ్యాయులు వడ్లకొండ శ్రీనివాస్, రామంచ రవీందర్ పాల్గొన్నారు.