– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
– కరణం ప్రహ్లాద రావు హర్షం
నవతెలంగాణ-కుల్కచర్ల
భారత మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీకి భారత ప్రభు త్వం ”భారతరత్న” ఇవ్వడంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాద రావు హర్షం వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలోని పా ర్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. పలువు రు మాట్లాడుతూ..రాజకీయ విలువలకు కట్టుబడి దశాబ్దాలుగా దేశవార సత్వ సంస్కృతీకి నిబద్దతతో కృషి చేసిన సేవలకు అద్వానీని ‘భారత రత్న’ తో గౌరవించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గౌడ్, మండలాధ్యక్షులు మహి పాల్ ముదిరాజ్, యువమోర్చా మండలాధ్యక్షులు గడుసు మహిపాల్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బోయిని భీమయ్య, సీనియర్ నాయ కులు రాంపూర్ రామకృష్ణ, కిసాన్ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఏదు ల సంతోష్ గౌడ్, పర్సాపురం వెంకట్ రాములు, దోమ మండల ప్రధాన కార్యదర్శి బొంగు మల్లేశం, రామచంద్రయ్య, గోపాల్, లక్ష్మయ్య, బీరయ్య, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.