– కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా, 16న దేశ వ్యాప్త సమ్మె
నవతెలంగాణ-శంషాబాద్
5వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాల యం వద్ద ధర్నా, 16వ తేదిన జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నామని శనివారం మున్సిపల్ కమిషనర్‌కు కార్మికులు సమ్మె నోటీసును శనివారం అందజేశారు. కార్మికు లు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మె, ధర్నాను విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా మున్సి పల్ కార్మికుల సంఘం సలహాదారులు డి.నగేష్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ మెంబర్ పి.జయేందర్ మండల ఉపాధ్యక్షులు ఎస్.రవి, మండల సెక్రటరీ డి. యాదగిరి, పి. యాదమ్మ, కె. సంపత్ సి. సిద్ధులు కోరారు.