”రావోరు కృష్ణా! చాలా రోజులకు తీరిక దొరికినట్లుంది!” అంటూ స్నేహితుడిని ఇంట్లోకి ఆహ్వానించాడు రాము.
”ఏం చేస్తాం! అంతా బిజీ లైఫ్! తీరిక దొరకటం లేదు! అంతా క్షేమంగా ఉన్నారా?” అంటూ పలకరించాడు కృష్ణ.
అవీ ఇవీ మాట్లాడుకుంటూ రాజకీయాల వైపు చర్చ మళ్ళింది!
నీవు ఎన్నైనా చెప్పు! గత పదేళ్లు మన దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయం! ఎంత అభి వృద్ధి? ఎన్ని గొప్ప చట్టాలు? ఎన్ని మార్పులు? ఇంతటి ఘనమైన మార్పు ఎవరూ ఊహించ లేదు! నభూతో నభవిష్యత్ అన్నంతగా మా రింది! ఒక్క మాటలో చెప్పాలంటే 2014లోనే స్వాతంత్య్రం వచ్చిందనుకో! తన్మయత్వంగా అన్నాడు రాము.
నిజమా! 1947లో వచ్చిన స్వాతంత్య్రం అనేక మంది త్యాగమూర్తుల పోరాట ఫలితం గా వచ్చిందని చిన్నప్పుడు మనం పుస్తకాలల్లో చదివినట్లు గుర్తు! మరి ఇప్పుడు ఎవరి త్యాగం వల్ల స్వాతంత్య్రం వచ్చిందంటావ్! అన్నాడు కృష్ణ.
ఊహించని ప్రశ్నకు ఖంగుతిన్నాడు రాము! అయినా తమాయించుకున్నాడు. ”ఒకే ఒక్క వ్యక్తి కారణంగా ఇది సాధ్యమయ్యింది! ఆయ న అపార మేధస్సు. సునిశిత పలరిశీలన, దేని కీ భయపడని ధీరత్వం మొ|| కలి,. మన దేశ రూపు రేఖలే మార్చివేశాయి. అందుకే స్వాతం త్య్రం వచ్చిందంటున్నాను” అన్నాడు రాము.
”అయితే ఆ ఒక్క మనిషి దేశంకోసం ఎలాంటి త్యాగం చేయలేదంటావు!” అన్నాడు కృష్ణ.
”ఎందుకు ఆయన్ను విమర్శిస్తారు! ఆయ న దేశం కోసం తన కుటుంబాన్ని వదులు కున్నాడు!
తల్లికి కూడా దూరంగా ఉన్నాడు! ఇంత కన్నా ఇంకేం చేయాలి!” అన్నాడు రాము.
”దేశం కోసం తన తండ్రిని, నాయనమ్మ ను కోల్పోయానని రాహుల్ గాంధీ అంటు న్నాడు!” అన్నాడు కృష్ణ.
”అయితే నీవు కాంగ్రెస్ వాదివన్నమాట!” అన్నాడు రాము.
”నేను కాంగ్రెస్ వాదిని కాను. ఏ వాదినీ కాను. సగటు మనిషిని. నా కోసం ఎవరు ఏం చేసారో అన్నదే నాకు ముఖ్యం!”అన్నాడు కృష్ణ.
”మొత్తం పరిపాలనే నీ కోసం జరుగుతు న్నది! అది అర్థం చేసుకో!” అన్నాడు రాము.
”నిజమా! మచ్చుకు రెండు వదులు!” అన్నాడు కృష్ణ.
”నీ కోసమే డీమానిటైజేషన్ చేసి, నల్ల ధనం వెలికి తీశాడు!” అన్నాడు రాము.
”బయటకు వచ్చిన నల్లధనం ఎంతో ఈ రోజుకీ లెక్క చెప్పలేదు. రిజర్వు బ్యాంకు చెప్పి న దాని ప్రకారం. నల్లధనం రాలేదు! కాని చి న్న చిన్న వ్యాపారులు దెబ్బ తిన్నారు. ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది! నల్ల ధనం బయటకు తెప్పించి, అకౌెంట్‌లో రూ.15 లక్షలు వేస్తామన్నారు! కానీ గత గత పదేళ్లలో రూ.15 కూడా అ కౌంట్లలో పడలేదు! అన్నాడు కృష్ణ.
”నీ కోసం అంటే సగటు మనిషి కోసం ఎన్ని చట్టాలు మార్చాడు దాని వల్ల ఎంతో మనకు లాభం జరిగింది!” అన్నాడు రాము.
”మార్చిన చట్టాలేవీ నాలాంటి వాళ్ళకు లాభం కలిగించలేదు. పైగా ఎంతో నష్టాన్ని కల్గించాయి! కార్మికులు ఎన్నో ఏళ్ళు పోరాడి త్యాగాలు చేసి, సాధించుకున్న కార్మిక చట్టా లను, లేబర్ కోడ్స్ అనే పేరుతో యజమా న్యాలకు అనుకూలంగా మార్చి వేశాడు. మీ పెద్దాయనకన్నా బ్రిటీషోడే నయం! కార్మికు లకు అనుకూలంగా కొన్ని చట్టాలు చేశాడు” అన్నాడు కృష్ణ.
”అదిగో నీకు దేశభక్తిలేదు! అందుకే బ్రిటీష్ వాడికి సపోర్టు చేస్తున్నావు!” అన్నాడు రాము.
”ఆక్సిడెంట్ జరిగితే కేవలం రెండేళ్లు జైలు శిక్ష, లేదా జరిమానా మాత్రమే ఉండేలా బ్రిటీష్‌వాడు చట్టం చేశాడు. కాని ఆక్సిడెంటు ని హత్యానేరంగా మార్చుతూ ఐదేండ్ల జైలు శిక్షతో పాటు రూ.పదిలక్షల జరిమానాగా మా ర్చుతూ మీ పెద్దాయన చట్టం చేశాడు. నీవు కారు డ్రైవింగ్ చేస్తావు కదా! ఎప్పుడైనా హత్య చేయాలని ప్రయత్నించావా?” ప్రశ్నించాడు కృష్ణ.
”మనందరం గుళ్లో పూజ చేయాలని, రా ములవారికి అయోధ్యలో గుడి కట్టించాడు!” అంటూ మాట మార్చాడు రాము.
”మనకు భద్రాచలం రాముడి దయ చాల దా! అయోధ్య రాముడి దయే కావాలా? అ యోధ్య రాముడు మాత్రమే ఒరిజినలా? మిగి లిన రాముళ్ళంతా డూప్లికేటా? అయినా ఒక గిరిజన మహిళను గుళ్లోకి రానివ్వని అయో ధ్య రాముడి కన్నా, గుడి బయటకే వచ్చి, అందరి ముందూ పెళ్లి చేసుకునే భద్రాచలం రాముడే నాకు కావాలి” అన్నాడు కృష్ణ.
”ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను రూపురేఖలు మార్చుకునేలా చే స్తోంది! ప్రపంచంలో మనది మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోయింది! ఇదంతా మా పెద్దాయన చలవే. గత 60 ఏళ్లలో పదిశా తం అభివృద్ధి సాధిస్తే కేవలం పదేండ్లలో 90 శాతం అభివృద్ధి సాధించాము!” అన్నాడు రాము.
”ఊర్లోని దొర పొలమూ, నా పొలమూ కలిసి వందెకరాలు అని ఒక ఆసా మీ చెప్పేవాడు. దొర పొలము 99 ఎకరాలైతే, ఆసామీ పొలము ఒక్క ఎకరానే! మన ఆర్థిక వ్యవస్థ బం డారమూ అంతే! దేశంలోని కష్టజీ వులు సృష్టించిన సంపదంతా. అంబానీలకు, ఆదానీలకు వెళ్ళి పోతోంది! దేశంలోని పేదరికం పెరిగిపోతుంది! పదేళ్ళలో నీ ఆస్థి ఎంత పెరి గింది! ఎన్ని కోట్లు సంపాదించావు!” అడిగాడు కృష్ణ.
”ఎక్కడి కోట్లు, ఎట్లా సంపాదిస్తాను, వ స్తున్న జీతంలో 30శాతం ఆదాయపన్ను కడు తుంటే, డబ్బులు ఎట్లా మిగులుతాయి!” అ న్నాడు రాము.
”అదీ అసలు విషయము! గత పదేళ్ళలో జీతం ద్వారా బతికే నీవు అభివృద్ధి చెందలేదు వ్యవసాయం చేసుకుని బతికే రైతు అభివృద్ధి చెందలేదు! అడ్డమీద పని చేసుకుని బతికే కూ లి కనీస అవసరాలు కూడా తీరలేదు! అసం ఘటిత రంగ కార్మికుల కనీస వేతనాలు పెరగ లేదు! ఒక పరిశ్రమ లేదు! ఒక్క ప్రాజెక్టు లేదు! పట్టుమని పదిమందికి ఉపాధిó దొరకలేదు! పే దవాడు చదువుకునేందుకు ఒక్క విశ్వవిద్యాల యము నిర్మించలేదు! ఇవన్నీ నిజాలేనా కాదా!” అడిగాడు కృష్ణ. తలదించుకున్నాడు రాము.
”మరింకేమి అభివృద్ధి చెందిందో తెలు సా! ఆదానీ, అంబానీల ఆస్తులు! ఆ ఆస్తులు ఎలా పెరిగాయో తెలుసుకోకుండా మనలాం టి వారికి అయోధ్య రాముడిపై భక్తి, పాకిస్తా న,్ చైనాలపై ద్వేషము పెంచుతున్నారు! ఈ ంంధిలో పడి మనలోమనమే కొట్టుకుని పోతు న్నాము. ఇప్పటికైనా మనలాంటి వాళ్ళంతా కళ్లు తెరవటం అవసరం! అన్నాడు కృష్ణ.
– ఉషాకిరణ్