– చేవెళ్ల ఎంపీ రేసులో పట్నం కుటుంబీకులు..?
– తాండూరులో షికార్లు కొడుతున్న పుకార్లు
– అసెంబ్లీ ఎన్నికల్లో కలిసిరాని బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు
– ఎన్నికల కోసం ప్రత్యర్థులను కలుపుకొన్న ఫలితం శూన్యం
– లోక్ సభ ఎన్నికల్లో నిలబడేందుకు నాయకుల మంతనాలు
– రసవత్తరంగా జరుగనున్న చేవెళ్ళ పార్లమెంట్ ఎన్నికలు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్ని కలతో రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. తాండూరులో అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు నాయకుల కలయికతో అవలీలగా గెలుస్తోందన్న బీఆర్‌ఎస్ ఓటమి పాలైంది. వికారాబాద్ జిల్లా అంతటా నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ఓటమి పాలైంది. గతంలో తెలంగాణ ప్రభుత్వ మంత్రి వర్గంలో తనదైన ముద్ర వేసుకొన్న మహేందర్‌రెడ్డి కూడా బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడేంట్ కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మహేందర్‌రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాండూరు నియో జకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి బ్యానర్ దర్శనం ఇస్తోంది. దీంతో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరు తున్నట్లు పుకార్లు తాండూరులో షికార్లు కొడుతు న్నాయి. రానున్న రోజుల్లో అవి నిజం అవుతాయా లేదా అనేదీ కాలమే నిర్ణయం చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే రాజకీయ చక్రం తిప్పే మహేందర్‌రెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీ విడు చుకునేందకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. మహేందర్‌రెడ్డి పరిస్థితి ఏంటీ అనే ఉత్కంఠత జిల్లాలో నెలకోంది. తాండూరులో అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయాల్లో అనుకుని పరి ణామాలు చోటుచేసు కున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాజకీయాలు తారుమారు అయ్యా యి. తాండూరు నియోజకవర్గంలోని వివిధ మం డలాల్లో ఎన్నికల వేళా వలసలు జోరుగా బీఆర్‌ఎస్‌లోకి కొన సాగాయి. అప్పట్లో రాత్రి వరకు ఒక పార్టీలో ఉన్న నాయ కులు తెల్లారితే మరో పార్టీలో దర్శణం ఇచ్చారు. తాండూ రులో ఎండ్లతరబడి పత్యర్థులుగా ఉన్న పార్టీలల్లో నాయ కులు చేరారు. ఉమ్మ డి రంగారెడ్డి జిల్లాకు పదేళ్ళు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నా సునీతా మహేం దర్‌రెడ్డి పార్లమెంటు ఎన్నికల బరిలో ఉంటే గెలుపు సులువు అవుతోందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పదేళ్ళుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోని అన్ని మండలాలు గ్రామాలపై సునీతా మ హేందర్‌రెడ్డి మంచి పట్టుందని పలువురు అభిప్రా యడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి చెవెళ్ళ ఎంపీ గా ఎన్నికల బరిలో ఉంటారని తెలుస్తోంది. ఏదే మైనా ఈ సారీ పార్లమెంటు ఎన్నికలు చేవెళ్ళలో రసవత్తరంగా జరుగనున్నాయి.