పార్టీలు వేరైనా రైతులంతా ఒకటిగా ఉండాలి

– రైతు లేనిదే రాజ్యం లేదు
– రాష్ట్ర కోశాధికారి ఎల్‌ మాణిక్‌ రెడ్డి
నవతెలంగాణ-కోట్‌పల్లి
పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటుంటే రైతుల తో పెట్టుకునే శక్తి ఏ పార్టీకి గాని రాజకీయ నాయ కులకుగాని లేదని అందుకు ప్రతి ఒక్క రైతూ ఏకం కావాలని రాష్ట్ర కోశాధికారి ఎల్‌ మాణిక్‌ రెడ్డి అన్నా రు. శనివారం మండల పరిధిలోని బార్వాద్‌ గ్రామం లో తెలంగాణ భారతీయ కిసాన్‌ సంఫ్‌ు రైతు సం ఘం గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ కార్యదర్శిగా ఆలూరి రవీందర్‌ రెడ్డి, మోత్కుపల్లి శ్రీశై లం, సభ్యులుగా కర్ణయ్య, గాండ్ల శేఖర్‌, కొత్తపల్లి వెంకట్‌ రెడ్డి, మహిపాల్‌ రెడ్డి, పరశు రాంను నియ మించారు. మనిక్‌ రెడ్డి మాట్లాడుతూ రైతు లేనిదే రాజ్యం లేదు అనే నినాదంతో ప్రతి రైతూ ఏకమై పార్టీలకు గుణపాఠం చెప్పినప్పుడే రైతులు బాగుపడతారని తెలిపారు. ప్రతి వ్యక్తి రైతు పండిం చిన పంటలనే ఆహారంగా తీసుకున్నారు. రైతులను చిన్నచూపు చూడడం, పండించిన పంటలకు గిట్టు బాటు ధర లేక ఓవైపు రైతులు ఆత్మహత్యలు చేసు కుంటున్నారు. రైతులు ఏకమై సంఘంగా ఉంటే తా ము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిం చేందుకు ప్రభుత్వాన్ని మెడలు వంచే ధైర్యం సంఘానికి ఉంటుందని తెలిపారు. ప్రతి రైతూ ఈ సంఘంలో చేరి అందరూ ఏకం కావాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బిఎన్‌రెడ్డి రైతులు మహేందర్‌ రెడ్డి, నరసింహారెడ్డి, కష్ణారెడ్డి, గౌరీ శంకర్‌, నర్సింలు గౌడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ఈశ్వరయ్య స్వామి, గ్రామ రైతులు తదితరులు ఉన్నారు.