నవతెలంగాణ-మిరుదొడ్డి
ముదిరాజులకు జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాలని, బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చాలని ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మల బాలరాజు అన్నారు. మిడిదొడ్డిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లో ముదిరాజులను ఓటుబ్యాంక్‌గా చూస్తున్న రాజకీయ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజ్‌లకు నాలుగు ఎంపీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ మండలం అధ్యక్షులు తుమ్మల విద్యాసాగర్ ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు కరాటి శివకుమార్, మాజీ ఎంపిటిసి గొట్టం బైరయ్య, నాయకులు బోయి నాగభూషణం, ఉషికే కనకరాజు, నరేశ్, రామచంద్రం, నాగరాజు, రాజశేఖర్, తుమ్మల చంద్రం పాల్గొన్నారు.