విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తున్న మహతి విద్యాకేతన్‌

– ప్రతి ఏటా పదో తరగతిలో నూరుశాతం ఫలితాలు
నవతెలంగాణ- గజ్వేల్‌
విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తూ మెరుగైన ఫలితాలను సాధిస్తున్న మహతి విద్యా కేతన్‌ ఇంగ్లిష్‌ మీడియం హైస్కూల్‌ ముందుకు దూసుకుపోతోంది. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతి ఏటా నూటికి నూరు శాతం ఉత్తీర్ణతకు యజమాన్యం కషి చేస్తోంది. 1996లో గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన మహతి విద్యా కేతన్‌ ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. పట్టుదల, క్రమశిక్షణతో విద్యార్థులకు విద్యాభ్యాసం అందిస్తున్నారు. పేద విద్యార్థులకు ఫీజుల విషయంలో తగిన సాయం చేస్తూ పాఠశాల పేరు ప్రతిష్టలు నిలబెట్టుకుంటోంది. పాఠశాల చైర్మన్‌ షబానా ముంతాజ్‌, ప్రిన్సిపాల్‌ గోపి మాస్టర్‌ ప్రత్యేక శ్రద్ధతో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ తల్లిదండ్రులతో శభాష్‌ అనిపించుకుంటోంది. పాఠశాలకు విశాలమైన స్థలం ఉండడంతో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆటల్లో జిల్లా, రాష్ట్రస్థాయిలో విద్యార్థులు ప్రతిభ చాటుతున్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలపై పాఠశాలలో విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజూ విద్యార్థుల పనితీరును పరిశీలిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 57 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వంద శాతం మార్కులు సాధించి పూర్తిస్థాయిలో ఉత్తీర్ణులను చేసేందుకు చైర్మన్‌ షబానా ముంతాజ్‌, ప్రిన్సిపాల్‌ గోపి మాస్టర్‌, ఉపాధ్యాయులు కషి చేస్తున్నారు. తెలుగు పి.సబితా, హిందీ నఫీస్‌ ఫాతిమా, ఇంగ్లిష్‌ ఎంఎల్‌ కాంతారావు, గణితం, సాంఘిక శాస్త్రం వీజేరెడ్డి, ఫిజిక్స్‌ ఫరీన్‌, బయాలజీ సిరాజుద్దీన్‌ బోధిస్తున్నారు. ఉపాధ్యాయులు సకాలంలో వచ్చి మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరిగే పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు.
క్రీడల్లోనూ రాణిస్తున్న విద్యార్థులు
పాఠశాలలో విద్యతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారు. ప్రతి ఏటా పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు యాజమాన్యం కషి చేస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారు. ఉపాధ్యాయులు సకాలంలో హాజరై బోధిస్తున్నారు. పాఠశాలలో స్మార్ట్‌ ఫోన్లు విద్యార్థులకు దూరంగా ఉంచుతున్నాం. ఈసారీ వందశాతం ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేస్తున్నాం.
– గోపి శర్మ, ప్రిన్సిపాల్‌