నవతెలంగాణ-సదాశివపేట
నేటి యువకులను నిర్వీర్యం చేస్తున్న చెడు వ్యసనాలు, మాదకద్రవ్యాలను, మత్తుపదార్థాలను నివారించాల్సిన భాద్యత ప్రతీ ఒక్కరిపై ఉన్నదని పి.రాములు గౌడ్ అన్నారు. ‘దేశాభివధ్ధిలో నేటి యువతరం పాత్ర’ అనే అంశంపై సదాశివపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆప్ సంగారెడ్డి ఆదర్శ, మరియు లియో క్లబ్‌లు సంయ ుక్తంగా ప్రిన్సిపాల్ పతంజలి సమక్షంలో లయన్స్ క్లబ్ అధ్య క్షులు లయన్ యం.వెంకటేశం అధ్యక్షతన శనివారం సెమినర్ నిర్వహించారు. ఈ సెమినార్‌కు కళాశాల లియో కో ఆర్డినేటర్ లయన్ పి.రాములు గౌడ్ ముఖ్య అతిథిగా పాలగని మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాలతో లయన్స్ క్లబ్ మరి యు లియోక్లబ్ ద్వారా మాదకద్రవ్యాలను నిరోధించుటకు కషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ విజ్ఞప ి్తతో.. కళాశాలలో మౌలిక సదుపాయాలను లయన్స్ క్లబ్‌ను కోరగా..కళాశాలకు డెస్క్‌లను మరియు చైర్‌లను సమకూ రుస్తామని రాములుగౌడ్ చెప్పారు. ఈ కార్యక్రమలో కళా శాల ప్రొఫెసర్లు అనూరాద, పద్మ, ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆరి ్డనేట ర్లతో పాటు లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మె లయన్ వెంకటరమ ణ, లయన్‌రాంగోపాల్, పిసికల్‌డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.