– వ్యసనాన్ని మానుకోవాలి లేదా వేరే చోటుకు తరలివెళ్లాలి
– జహీరాబాద్ సీఐ రవి..
నవతెలంగాణ-జహీరాబాద్
గంజాయి లాంటి మత్తు పదార్థాలను విక్రయించే వారు, ఆస్వాదించే వారు తక్షణమే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని.. లేదా తమ వ్యసనాలను మానుకోవాలని జహీరాబాద్ సీఐ ఆర్ రవి హెచ్చరించారు. లేని యెడల వారిపై కఠిన చర్యలు తప్ప వన్నారు. శనివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లా డుతూ.. తమ సిబ్బంది ఎవరు కూడా సివిల్ తగాదాల్లో తల దూర్చరన్నారు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే.. నేరుగా తనను సంప్రదించాలన్నారు. నేరస్తులతో కఠినంగా ఉంటూ మిగతా ప్రజలతో ఫ్రెండ్ల్లీ పోలీసింగ్ కొనసాగిస్తం అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపంలో ఉన్నందున బాధ్యత తీసుకున్న రెండు రోజుల్లోనే కోహీర్ జహీరాబాద్ పట్టణంతో పాటు మండలంలోని వివిధ ప్రాంతాలలో పర్య టించి సమస్య ఆత్మక ప్రాంతాలను గుర్తించినట్టు చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించే వారిని ఉపేక్షించబో మన్నారు. ఆక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఎట్టి పరిస్థితులల్లో గుమ్మిగూడొద్దని.. ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. రోడ్లపై అడ్డగోలుగా ఆటోలు నిల్పొద్దని.. ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ డాకుమెంట్స్ వెంట పెట్టుకోవాలన్నారు. వారు ఒక నెల రోజులలోపు అన్ని సమకుర్చుకోవాలని.. అటు పిమ్మట వెహికిల్ వెంట డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్‌కు సంబంధిన డాకుమెంట్స్ లేకుంటే వెహికిల్ సీజ్ చేసి చట్టపరమైన తగు చర్యలు తీసుకరటామన్నారు. రోడ్లపై రాష్ డ్రైవింగ్ చేయొద్దని.. బుల్లెట్ వాహనాలకు హై సౌండ్ కల్గిన సైలెన్సరులు పెట్టొద్దన్నారు. ఎవరైనా వాటిని వినిj ెూగిస్తే వెహికిల్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించొద్దన్నారు. ఎవరైనా అనుమా నస్పదంగా తిరిగితూ కనిపిస్తే పోలీసులకు సమాచారం అం దించాలన్నారు. యువతీ యువకులు చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అది సరికాదన్నారు. ఇప్పటికే ప్రతీ గ్రామంలో బెల్ట్ షాపుల వారికి పలు సూచ నలు చేశామని.. వారు ఇతర వ్యాపారాలకు మల్లకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.