ప్రతీ పల్లెను ప్రగతికి తార్కానంగా తీర్చిదిద్దాం

నవతెలంగాణ-పటాన్‌చెరు
ప్రజాస్వామ్యంలో పదవులు అత్యంత బాధ్యతతో కూడుకున్నవని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే ప్రజల ఆశీర్వాదం పొందవచ్చని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి అన్నారు. పటాన్‌ చెరు డివిజన్‌ పరి ధిలోని జిఎంఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్లో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో తాజా మాజీ సర్పంచులకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్భంచులను శాలువా, మేమొంటో తో సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో ఐదేండ్ల పాటు గ్రామాల అభివద్ధికి అహర్నిశలు కషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య కమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, ఎంపీపీలు దేవానందం, సుష్మా శ్రీ వేణుగోపాల్‌ రెడ్డి, ప్రవీణ విజయ భాస్కర్‌ రెడ్డి, జెడ్పీటీసీలు సుప్రజా వెంకట్‌ రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, కుమార్‌ గౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మె న్‌ విజరుకుమార్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జిన్నారం: మండల పరిధిలోని గ్రామ పంచాయతీల వారీగా సర్పంచులను, ఉపసర్పంచులను, ప్రజా ప్రతినిదలను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి శనివా రం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఐదేళ్లపాటు అభివద్ధిలో భాగమైన ప్రజా ప్రతినిధులు అందరినీ అభినం దించారు. శాలువాలతో సత్కరించి మేమంటోలు జ్ఞాపికలు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ కుంచాల ప్రభాకర్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత జిన్నారం వెంకటేశం గౌడ్‌, పార్టీ మండలాధ్యక్షుడు రాజేష్‌, సీనియర్‌ సర్పంచులు ప్రకాశంచారి, శెట్టి శివరాజ్‌, జనార్ధన్‌, ఖదీర్‌ ఆంజనేయులు, సుశాంతి నవనీత రెడ్డి, ప్రశాంతి, సరిత సురేందర్‌ గౌడ్‌, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.