అధైర్య పడొద్దు.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది

– పెద్దపల్లి జెడ్పి చైర్మన్  పుట్ట మధుకర్ 
నవతెలంగాణ –  మల్హర్ రావు
అధైర్య పడొద్దు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జి,పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మదుకర్ అన్నారు. మంథని నియోజకవర్గంలోని కమాన్ పూర్ పెంచికల్ పేట బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఎద్దు రాజయ్య అనారోగ్యంతో కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆదివారం పుట్ట ఆయనను పరమార్షించి, ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అదైర్య పడొద్దు అన్నివిధాలా బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆయన వెంటా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.