ఎస్సీ బాలికల వసతి గృహం వద్ద ఉద్రిక్త వాతావరణం..

– జిల్లా ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత
– మృతికి హాస్టల్ వార్డెన్, ఆటో డ్రైవర్ కారణం
– సూసైడ్ లెటర్ పై అనుమానాలు ఉన్నాయని బంధువుల ఆరోపణ
– మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
– బాలికలకు రక్షణ కల్పించాలి
– ప్రజాసంఘాలు, విద్యార్థి నాయకుల ధర్నా, రాస్తారోకో
నవతెలంగాణ  – భువనగిరి
అభము శుభము ఎరుగని ముక్కు పచ్చలారని ఇద్దరు నిరుపేద విద్యార్థునుల ఆత్మహత్యలు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజల కండ్లలో కన్నీళ్లు కార్ఛాయి. శనివారం రాత్రి జరిగిన కోడి భవ్య (15), గాదే వైష్ణవి(15) ఆత్మహత్యల కు నిర్లక్ష్యమే కారణం అని స్పష్టంగా కనబడుతుంది. కలిసి చదువుకున్న ఆ ఇద్దరు అమ్మాయిలు కలిసే ప్రాణాలు విడచడం చూసిన వారి మనసు బరువెక్కడం ఖాయం.  బాలికల హాస్టల్ వద్ద హాస్టల్ వార్డెన్ ఉండకపోవడం స్పష్టంగా కనబడ్డది అధికారుల వైఫల్యం బాలికలకు రక్షణ కల్పించకపోవడం హాస్టల్లో ఉన్న వంట మనిషిపై, రోజు పాఠశాలకు తీసుకపోయే ఆటో డ్రైవర్ ఆంజనేయులుపై వార్డెన్ పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.   విద్యార్థులను చూడడానికి భువనగిరి పట్టణంలోని మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు.  విద్యార్థుల మధ్య కొనసాగిన వివాదం కౌన్సిలింగ్ పేరిట పి ఈ టి, వార్డెన్లు సరైన విధంగా స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి హాస్టల్ వద్ద రక్షణ లేకపోవడం జరిగింది కనీసం హాస్టల్లో వార్డును ఉండకపోవడం పి ఈ టి సమాచారం మేరికే వచ్చినట్లు తన ఇంటికి తీసుకుపోయి అందరు విద్యార్థులు చేసిన విధంగా వారి ప్రవర్తనలో మార్పులపై కౌన్సిలింగ్ చేసినట్లు  వార్డెన్ శైలజ పేర్కొంది.
హాస్టల్ ముందు ఆందోళన: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహం లో శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు బాలికల కుటుంబాలకు మద్దతుగా వసతి గృహం ప్రధాన గేటు ముందు  ప్రజాసంఘాలు, విద్యార్థి నాయకుల  నినాదాలతోలతో ఆదివారం తెల్లవారుజామునే దద్దరిల్లింది. మృతుల కుటుంబం పక్షాన ఐద్వా మహిళా సంఘం వారికి అండగా నిలబడ్డది. మృతి చెందిన బాలికల కుటుంబాలకు  న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.   హాస్టల్ లో సి సి కెమెరాలు లేవు,  కనీస పర్యవేక్షణ లేదనీ ఆరోపించారు. సూసైడ్ లెటర్ పై అనుమానాలు ఉన్నాయని అన్నారు.  ఉరి వేసుకుంటే  పోలీసులకు ఎందుకు చెప్పలేదని హాస్టల్ అధికారులను  కుటుంబీకులు ప్రశ్నించారు.  క్లూస్ టీమ్ , సఖీ టీమ్ సభ్యులు హాస్టల్ లోకి వెళ్ళారు. వైష్ణవి తండ్రి, మేనత్త సంధ్య మాట్లాడుతూ ఉరి వేసి  చంపినట్లు ఉందని ఆరోపించారు. ఉరి వేసుకుంటే పోలీసులను ఎందుకు పిలవలేదని ఆమె అధికారులను ప్రశ్నించారు. బాలికలను హాస్టల్ నుంచి స్కూల్ కి తీసుకెళ్లే ఆటో డ్రైవర్   ఆంజనేయులు ప్రవర్తన సరిగాలేదని హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్లామని కన్నీరు పెడుతూ తెలిపింది. అయినా వార్డెన్ చర్యలు తీసుకోలేదని    కుటుంబీకులు ఆరోపించారు. హాస్టల్ లోనికి మీడియాను అనుమతించక పోవటం పట్ల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి అధికారుల పై చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. నిన్న ఒక రకంగా ఒకరకంగా హాస్టల్ వార్డెన్ తో పాటు అధికారులు, పోలీసులు చెబుతున్నారని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. తాము పేద వారిమని పోలీసులు, అధికారులు చిన్న చూపు చూస్తున్నారని అన్నారు.
ఏరియా ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ఆందోళన: హాస్టల్లో పరిశీలించిన అనంతరం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ రాస్తారోకో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.  ఒక్కొక్కరుగా వందలాదిమంది ఆ రాస్తారోకోలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బట్టు రామచంద్రయ్య మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు న్యాయం కావాలన్నారు విద్యార్థులు రాసిరని చెప్తున్న లెటర్ పై పూర్వం నిపుణులతో పరిశీలించి నిజాలు బయటికి తీయాలన్నారు ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు చెల్లించాలన్నారు మృతుల తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం పోలీసులు ఫిర్యాదు తీసుకొని విచారణ జరిపి కేసు నమోదు చేయాలన్నారు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ లేక వారి తరుపున జాయింట్ కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ శనివారం రాత్రి సంఘటన తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్నారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు తెల్లవారుజామున వారు హాస్టల్లో జరిగిన సంఘటనపై విద్యార్థులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏరియా ఆసుపత్రి వద్ద జరిగిన ధర్నాలో పాల్గొని పలు అనుమానాలను వ్యక్త చేశారు మృతికి కారణాలను పూర్తిస్థాయిలో విచారణ జరిపి బయట పెట్టాలన్నారు కారకులపై కఠిన శిక్షలు వేయాలి అన్నారు వృత్తుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు కన్న తల్లిదండ్రుల గురించి లెటర్లో ఎలాంటి రాయకపోవడం పై అనుమానాలు ఉన్నాయన్నారు హాస్టల్ వార్డెన్ ఏమీ అనొద్దు అన్న విషయం తప్ప అందులో ఏమీ లేదని అన్నారు బాలికల హాస్టల్ వద్ద కనీస రక్షణ లేదని ఆరోపించారు సీసీ కెమెరాలు లేవు అన్నారు అధికారులు సరిగా స్పందించలేదన్నారు. బాధ్యత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఉద్యోగం కల్పించాలని కోరారు. బిజెపి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న ఎస్సీ హాస్టలకు రెండు కోట్లు మంజూరు చేసిన నిర్మాణం చేయకపోవడం బాధాకరమన్నారు రక్షణ లేని భవనంలో హాస్టల్లో నడిపిస్తున్నారన్నారు.
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే కుంభం ఆర్థిక సహాయం: భువనగిరి ఎస్సీ వసతి గృహంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి  మృతుల ఇరు కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 వేల చొప్పున లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఘటనపై కుటుంబ సభ్యులను పరామర్శించి తీవ్ర దిగ్బ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కోరిన విధంగా వరంగల్ జిల్లాలో లేక భువనగిరిలో స్థలము తో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం లేక డబల్ బెడ్ రూమ్ అందిస్తామని తెలిపారు అత్యంత నిరుపేదలు కావడంతో వారి కుటుంబంలో అర్హులైన వారికి ఒక్కొక్కరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా  చూడాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు. దీంతో అనిల్ కుమార్ రెడ్డి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని మీడియా ముందు వెల్లడించారు. నెలకొన్న ఆందోళన పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి
ప్రభుత్వం విద్యార్థినులకు చెరో 20 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఇవ్వాలి
కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున డిమాండ్ : ఇద్దరు విద్యార్థునులు హాస్టల్లో ఉరేసుకొని శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారని  ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఇద్దరు విద్యార్థులకుచెరో 20 లక్షల ఎక్స్ గ్రేసియా ప్రకటించి ఇవ్వాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఈరోజు కెవిపిఎస్ ప్రజా సంఘాల  ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో రాస్తారోకో  కార్యక్రమం చేపట్టడం జరిగింది.  ఈ సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ  సాయి కృప డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఎస్సీ హాస్టల్ లో ఈ ఘటన చోటు చేసుకుందని విద్యార్థినులను కౌన్సెలింగ్ పేరుతో పి ఈ టి, వార్డెన్, ఆటో డ్రైవర్లు కలిసి నిబంధనలకు విరుద్ధంగా విచారణ చేసినారని అన్నారు. కనీసం విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలియజేయలేదని ఈ ఘటన వారం రోజులుగా జరుగుతున్నప్పటికీ పై అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లలేదని అన్నారు. కౌన్సిలింగ్ పేరుతో విద్యార్థులు మనస్థాపానికి గురయ్యారని అన్నారు. జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించకపోవడం కనీసం కుటుంబాలను పరామర్శించకపోవడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రభుత్వ ఉద్యోగం చెరో 20 లక్షల ఎక్స్రేసియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షులు అన్నం పట్ల కృష్ణ నాయకులు నర్సింహా చంద్రమౌళి అశోక్ కుమార్ సాయి కిషోర్ పాల్గొన్నారు.కోడి భవ్య, గాదే వైష్ణవిల మరణం ల పై న్యాయ విచారణ జరిపించాలి.
 రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్ పీ ఓ డబ్ల్యూ – పీ వై ఎల్ – ఏ ఐ కే ఎం ఎస్ – పీ డీ ఎస్ యు. 
భువనగిరి పట్టణంలోని ఎస్సీ గురుకుల పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న కోడి భవ్య, గాదే వైష్ణవి లు ఆకస్మికంగా చనిపోవడం అనేక అనుమానాలను రేకిత్తిస్తుందని,చనిపోవడానికి ముందు వారిద్దరు వ్రాసిన సూసైడ్ నోట్ ను వాళ్ళే వ్రాశారా దానివెనుక ఎవరివైన ప్రోద్బలం,బెదిరింపులు తదితర అనేక అనుమానాలపై సిట్టింగ్ జర్జీ  చేత విచారణ జరిపించాలని *ప్రగతిశీల మహిళా సంఘం (పీ ఓ డబ్ల్యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.సీత,ప్రగతిశీల యువజన సంఘం (పీ వై ఎల్ ) జిల్లా ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్, అఖిల భారత రైతు.కూలీ సంఘం (ఏ ఐ కే ఎం ఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర బోయిన రాజయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పద్మ సుదర్శన్, రేగు శ్రీశైలం, పీ డీ ఎస్ యుజిల్లా నాయకులు ఆర్.ఉదయ్ లు డిమాండ్ చేశారు.
ఏది ఏమైనా ఎంతో భవిషత్ ఉన్న భవ్య, వైష్ణవి ల మరణాలు చాలా బాధను, ఆవేదనను కలిగించాయన్నారు. వారి తల్లి తండ్రుల కన్నీళ్లను,బాధను ఆపడం ఎవరికి సాధ్యం కాదని,చనిపోయిన విద్యార్థినీల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం చెరో యాభై లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని,వారివి హత్యలని తేలితే చట్టపరంగా దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.