
పోరాటాల పురిటి గడ్డ మహనీయులకు జన్మనిచ్చిన కరివిరాల కొత్తగూడెం ముద్దుబిడ్డ వర్దెళ్లి రాములు పార్టీకి చేసిన సేవలు మరువలేనివని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యేజూలకంటి రంగారెడ్డి అన్నారు.ఆదివారంమండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకులు వర్దెళ్లి రాములు సంతాప సభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ నాడు ఈ ప్రాంతంలో జరిగిన వీర తెలంగాణ సాయుధ పోరాటంలో కొత్తగూడెం గ్రామం నిర్వహించిన పాత్రమరవలేనిది అన్నారు. ఈ గ్రామంలో భీమిరెడ్డి రెడ్డి నరసింహారెడ్డి,మల్లు స్వరాజ్యం,మారోజు వీరన్న,భీమ్ రెడ్డి కుశలవ రెడ్డి,వర్దెళ్లి బుచ్చిరాములు లాంటి మహా నాయకులకు జన్మనిచ్చింది. కొత్తగూడెం గ్రామం అన్నారు.నేటికీ ఆ పోరాటగుర్తులు చరిత్ర ఏ చెట్టును అడిగిన పుట్టను అడిగిన అమరవీరుల పోరాటాలు, త్యాగాలుగుర్తుకొస్తాయన్నారు.కొ