ఇవి ఎక్కువగా తీసుకుంటే జుట్టురాలుతుంది.. జాగ్రత్త!

If you take too much of these, you will lose hair.. Be careful!ఆరోగ్యంగా, దృఢంగా జుట్టు పెరగాలని, ఉండాలని అందరూ కోరుకుంటారు. ఒత్తిడి వల్ల జుట్టు రాలిపోతుందనేది నిజమే కాని మనం ఇష్టంగా తినే కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఆ ప్రభావం జుట్టు మీద పడి రాలిపోయే ప్రమాదం ఉంది. అవేంటంటే…
– జంక్‌ ఫుడ్స్‌లో తరచుగా సంతప్త, మోనోశాచురేటెడ్‌ కొవ్వులు ఎక్కువగా ఉంటా యి. ఇవి ఊబకాయానికి కారణమవుతాయి. గుండె జబ్బులను కలిగిస్తాయి. వీటితో పాటు జుట్టు రాలడానికి కూడా కారణమవుతాయి.
– ఆయిల్‌ ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకున్నా, జుట్టుపై ప్రభావం పడుతుంది. ఆయిల్‌ ఫుడ్స్‌ స్కాల్ప్‌ను జిడ్డుగా మారుస్తాయి. తద్వారా రంధ్రాలు మూసుకుపోతాయి ఫోలికల్స్‌ను చిన్నవిగా చేస్తాయి.
– గుడ్డు తినడం శరీరానికి, జుట్టుకు మంచిదే. పచ్చి గుడ్డు లోని తెల్లసొన జుట్టుకు అప్లై చేసుకుంటే జుట్టు మృధువుగా, దృఢంగా పెరుగుతుంది కూడా. కానీ గుడ్డులోని తెల్లసొన పచ్చిగా తిన కూడదు. ఈ తెల్లసొనలో కెరాటిన్‌ ఉత్పత్తికి సహాయపడే బయోటిన్‌ అనే విటమిన్‌ లోపం ఉంటుంది. ఇది జుట్టుకు హాని చేస్తుంది.
– డైట్‌ సోడా డైట్‌ సోడాల్లో అస్పర్టమే అనే కత్రిమ స్వీటెనర్‌ ఉంటుంది, ఇది ఫోలికల్స్‌ను దెబ్బతీస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.
– చక్కెర ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఇది ఆరోగ్యానికే కాదు, జుట్టుకు కూడా సమస్యగానే మారుతుందట. అదెలాగంటే ఉబకాయానికి, మధుమేహానికి ఇన్సులిన్‌ తగ్గడం. ఈ ఇన్సులిన్‌ను నిరోధించే వాటిలో ప్రధాన కారకం చక్కెర, స్టార్చ్‌, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లలో అధికంగా ఉండే ఆహారం. ఆహారాలు అధిక గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఆహారాలు ఇన్సులిన్‌ స్పైక్‌కు కారణమ వుతాయి. శుద్ధి చేసిన పిండి, రొట్టె, చక్కెర వంటి ఆహారాలు అన్నీ అధిక గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఆహారాలు. ఈ ఆహారాలు హార్మోన్ల అసమతుల్యతకు కారణ మవుతాయి. ఇన్సులిన్‌, ఆండ్రోజెన్‌లలో స్పైక్‌ ను కలిగిస్తాయి. ఇవి జుట్టు రాలడానికి కారణమవుతాయి.
– అధికంగా ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల పోషకాల అసమతుల్యత ఏర్పడి జుట్టు రాలిపోతుంది.