కూనేపల్లి గ్రామంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలంలోని కూనేపల్లి గ్రామం సబ్ సెంటర్లో ఆయుష్ డాక్టర్ ప్రమోదిత క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె అన్నారు. ప్రతి అవయవానికి వేరువేరు లక్షణాలతో మాన కుండ ఏర్పడే పుండు, కణతి లాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ ఆడవారికి రొమ్ములో గడ్డలు, గర్భాశయం ముఖద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. హెచ్ ఈ ఓ కరిపి రవీందర్ మాట్లాడుతూ పన్ ఫరాగ్, జర్ధా, గుట్కా తినడం వల్ల గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్నారు. ఇవే కాకుండా బోన్ క్యాన్సర్, ప్రెస్టేట్ ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చినప్పుడు బరువులు తగ్గే అవకాశం ఉంటుందని శ్వాస పీల్చడానికి అవస్థలు పడతా రన్నారు. మొదట్లో ఈ లక్షణాలను కలిగిన వారు వెంటనే డాక్టర్ను సంప్రదించినట్లయితే వాటిని నయం చేసే అవకాశం ఉందన్నారు. ఆన్సర్ కు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యంగా ముందుకు వచ్చి వాటిని తగ్గించుకునే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త భాగ్య, ఆశ వర్కర్లు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.