
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సాయంగా అందిస్తున్న కల్యాణ లక్ష్మి చెక్కులను ఉప్పునుంతల మండలంలోని వివిధ గ్రామాల పేదింటి ఆడపిల్లలకు డా.బి.అర్ అంబేద్కర్ ప్రజా భవన్ (క్యాంప్ ఆఫీస్ ) అచ్చంపేట భవనంలో సోమవారం అందజేసిన ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, మండల జడ్పిటిసి అనంత ప్రతాప్ రెడ్డి, తాహాసిల్దార్ తబితా రాణి, సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్, పెద్దాపూర్, కొరటికల్, రాయిచెడు గ్రామాలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.