
– అల్పాహారం, మంచినీటి పంపిణి సేవ కార్యక్రమాలు ప్రారంభం
– ఘనంగా అన్నదానం సేవ పంపిణి బ్రోచర్ ఆవిష్కరణ
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
అయోధ్యలోని రామా మందిరం హనుమాన్ గడ్ వద్ద ఉస్మాన్ గంజ్ కు చెందిన భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 20నుండి మార్చ్ 2వ తేదీ వరకు ప్రతిరోజూ సుమారు 30వేల మంది రామ భక్తులకు ఉచితంగా అల్పాహారం, అన్నప్రసాదం, మంచినీటి సేవా కార్యక్రమాలను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని బాస్ అధ్యక్షులు క్యాతం రాధాకృష్ణ , ప్రధాన కార్యదర్శి విజయ్ భాస్కర్ , కోశాదికారి మేడిశెట్టి రాకేష్ లు తెలిపారు.ఈ మేరకు సోమవారం అబిడ్స్,బొగ్గులకుంటలోని,తెలంగాణ సరస్వతీ పరిషత్తు ఆడిటోరియంలో అన్నదాన బ్రోచర్,అన్నప్రసాదా వెబ్సైట్ లను వీహెచ్పీ రాష్ట్ర ఆర్గానైసింగ్ సెక్రటరీ యాదిరెడ్డి,సాస్ అల్ ఇండియా ఆర్గానైసింగ్ సెక్రటరీ నాయిని బుచ్చిరెడ్డి , బాస్ సలహాదారులు దేవర రాజేశ్వర్, వెంకటేశం గుప్త చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశం నలుములల నుండి అయోధ్య బలరాముని చూడడానికి లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు బాస్ సంస్థ తమవంతు సహాయంగా అన్నదానం చేయడానికి ముందుకు రావడం సంతోషకర విషయమని వారు కొనియాడారు. ముఖ్యంగా బాస్ శబరిమల నిలకల్ వద్ద అన్నదానం , ఉస్మానియా ఆసుపత్రిలో రోగులకు మంచి నీటి పంపిణి , గోశాల నిర్వహణ , 40మంది అనాధ చిన్నారులను హక్కున చేర్చుకొని వారికీ వసతి , విద్య , వైద్యం అందించి వారిని సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దెందుకు చేస్తున్న కృషి ఎంతో గొప్పది అని అన్నారు .. రామ మందిరం ఆలయంలో అన్నదానం చేయడం అనేది బాస్ ప్రతినిధుల బృందం పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలమే అని వారు కొనియాడారు..ఈ అన్నదానంలో పాల్గొనే ఆసక్తికర భక్తులు ఉంటే www.annaprasadam.in ఈ వెబ్సైట్ లో సంప్రదించవచ్చని , మరిన్ని వివరాల కోసం ఫోన్ నెంబర్-9848083376 , 9396601234 నెంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు .. ఈ కార్యక్రమంలో శివ శంకర్ , నాగరాజు గౌడ్ , వెంకటేశం గురుస్వామి , హనుమంతు తదితరులు పాల్గొన్నారు.