చెరువులో పడి మహిళ ఆత్మహత్య 

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామ సమీపంలోని నల్ల చెరువులో పడి మహిళ మృతిచెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.  గ్రామానికి చెందిన మల్లూరి రాజు(50)కు చాలా రోజుల నుంచి మానసిక ఆరోగ్య స్థితి బాగాలేదు. భర్త గంగారం చాలా సంవత్సరాల క్రితమే మృతి చెందాడు. దీంతో ఒంటరిగా జీవిస్తున్న రాజు  మానసికంగా కృంగిపోయింది. ఒంటరితనం భరించలేక  మనస్థాపానికి గురై ఆదివారం రాత్రి సమయంలో  గ్రామ చెరువులో  పడి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం విషయం తెలిసిన ఎస్ఐ రాజశేఖర్ సంఘటన స్థలానికి వెళ్లి చెరువులో నుండి మృతదేహాన్ని బయటకు తీయించి, శవ పంచానామా నిర్వహించి, పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కూతురు సోని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ  తెలిపారు.