– జాతీయ రెజ్లింగ్ పోటీలు
జైపూర్ : రెజ్లింగ్ మహిళల 57 కేజీల విభాగంలో పోటీ తారా స్థాయికి చేరుకుంది!. ఒలింపిక్స్ బెర్త్ కోసం పోటీపడుతున్న అన్షు మాలిక్, సరితలు జాతీయ చాంపియన్‌షిప్స్‌లో సై అన్నారు. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో అన్షు మాలిక్ పైచేయి సాధించింది. మోకాలి గాయం నుంచి కోలుకున్న అన్షు మాలిక్ 8-3తో సరితపై విజయం సాధించింది. మహిళల 55 కేజీల విభాగంలో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ బంగారు పతకం సాధించింది. ఫైనల్లో జ్యోతిపై గెలుపొంది గోల్డ్ దక్కించుకుంది. ఒలింపిక్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ విజేతలకు మెడల్స్ ప్రదానం చేశారు.